22, డిసెంబర్ 2010, బుధవారం

పిల్లలకు సంబంధమైనవి - Children related

 చిన్నపిల్లలకు సంబందించినవి మన సాంప్రదాయం లో చాలా ఉన్నాయి. అందులో నాకు తెలిసినవి, కొన్ని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.

పిల్లలకు స్నానం చేయించిన తరువాత
స్నానం ముగించేటప్పుడు ఆ బుచ్కేట్ లో ఆఖరున కొన్ని నీళ్ళు ఉంచి,చెంబులో కొన్ని నీళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ ఈ క్రింద చెప్పినట్టు అనాలి :
జోత పోత జోన్నారి పోత , (అమ్మాయి/అబ్బాయి పేరు చెప్పి) చుసిన వాళ్ళంతా రోత రోత
(ఈ క్రింద అంటూ పిల్లల  చేతిని దండం పెడుతున్నట్టు చేసి )రాజ రాజేశ్వరుడికి జేజ, తిరుపతి వెంకన్నకు జేజ, అలమేలు మంగన్నకు జేజ, పద్మావతి కి జేజ, ముక్కోటి దేవతలకు జేజ ముక్కోటి దేవతలకు జేజ, ముక్కోటి దేవతలకు జేజ .
లేదా ఈ క్రింద రాసిన విధంగా అంటూ చేతిలో నీళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ తిప్పుతూ అనాలి
"శ్రీరామ రక్షా నూరేళ్ళు ఆయుష్షు "

5, నవంబర్ 2010, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు (2010)

మీ అందరి మీద ఆ లక్ష్మి దేవి కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ,
మీ అందరికి మరియు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు.
- శిరీష

25, అక్టోబర్ 2010, సోమవారం

Light - దీపం

దీపం మన హిందూ సంప్రదాయంలో చాలా విశిష్టత పొందినది.  దేవుడికి రోజు శుచిగా స్నానం ముగించి ఉతికిన బట్టలు కట్టుకొని తొలుత దేవుని ఎదుట నిలిచి నెయ్యి తో కాని నూనె తో కాని దీపాన్ని వెలిగిస్తారు.
దీపం వెలిగించే పద్ధతి:
ముందుగా దీపం లో వేయవలసిన వత్తిని తీసుకొని వాటి కొనలని వేళ్ళతో దగ్గరికి చేయండి. ఇప్పుడు దీపం లో నూనె కానీ నెయ్యి కాని వేయండి. వట్టి మొత్తం నూనె కానీ నెయ్యి తో కానీ తడపండి. ఇలా చేయటం వల్ల దీపం కొందేక్కదు(దీపం ఆరిపోయింది అని అనకూడదు, అందుకే దాని బదులుగ కొందేక్కింది అంటారు). ఇప్పుడు వత్తిని వెలిగించండి. కుంకుమను తీసుకొని మూడి పక్కల దీపానికి పెట్టండి. మీరు కూడా పెట్టుకోండి.
దీపం పెట్టె సమయం లో ఈ క్రింది శ్లోకం అనవలెను :
దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్ధన,
దీపేన హరతే పాపం, సంధ్యా దీపం నమోస్తుతే.
దీపము కలిగిన ఇంట, దాపున శ్రీలక్ష్మి ఉండి
పాపంములు పారద్రోలి, ధనముల నిచ్చున్,
ఆరోగ్యం, శాంతినిచ్చి, కాపాడుము మమ్ము బ్రహ్మాండముఖి .

దీపానికి ఎటు వైపు కుంకుమ పెట్టాలి ఎటు వైపు చూస్తూ ఉండాలి అనేవి ఇంకా నాకు తెలియని విషయాలు. అవి సేకరించినపుడు ఈ బ్లాగలో మళ్ళి జత పరిచేడను.
---------------------------------------------------------
In English:
Lights are an important part of the tradition in hindu religion. Everyday after taking bath, and wearing washed clothes, we stand in front of god and light the lamps (deepam). This lamps can be lit by either melted butter or with oil.
Lighting lamps :
First straigten the ends of the cotton threads(Vatti-in telugu) which we keep to light the lamps. Put it in the deepam samidha(this is where in which lit the lamp). Now add either melted butter or oil to it. Soak the cotton totally so that it does not turn off as soon as it is lit. Now lit the lamp with match stick or lighter. Take kumkum and put it three other sides of the deepam.
The following sloka should be told while lighting the lamps (especially in the evening):
Deepam jyothi parahbrahma, deepam jyothi janardhana
deepena harathe paapam, sandhya deepam namosthute.
Deepamu kaligina inta, daapuna srilakshmi undi,
paapammulu paara droli, dhanamula nicchun,
aarogyam, shaanthinicchi, kaapaadumu mammu brahmanda mukhi.

----------------------------------------------
I shall post some pictures soon. I shall update the blog as I remember/gather some more information on this.

Traditions - సంప్రదాయాలు

 ఈ రోజు ఈ కొత్త label ని ఈ బ్లాగలో కలుపుతున్నాను. ఈ కొత్త దాంట్లో మన రోజు వారి చిన్న చిన్న పద్దతులు, శ్లోకాలు మరియు మన సాంప్రదాయం గురించి రాయాలని కోరిక కనపరుస్తున్నాను. ఈ కొత్త label కూడా అందరు ఆనందిస్తారని ఆశిస్తున్న.
ధన్యవాదములు

-----------------------------------------------------
In English:
Today I am adding a new label to this blog called Traditions. This new one will contain our daily routines, small proverbs, slokas and our culture related details. Hope you like the topics in this new label also. As always thank you for reading this blog.

Thank you

12, అక్టోబర్ 2010, మంగళవారం

దసరా - జమ్మి చెట్టు (Dasara - Jammi Chettu)

జమ్మి చెట్టు మన ప్రాచీన సంప్రదాయంలో ఒక విశిష్టమైన చోటు కలది. దసరా నవరాత్రులలో, నవరాత్రి ఆఖరి రోజు అనగా దసరా పండుగ రోజు, సాయంత్రం పూట జమ్మి ఆకులను కోస్తారు. కొన్ని జమ్మి ఆకులు అక్షింతలు పెద్ద వాళ్ళ చేతిలో ఉంచి, వారి నుండి ఆశీర్వాదం తీసుకోవటం మన సాంప్రదాయం.  అది ఎందుకు అలా చేస్తారో కారణం నాకు తెలియదు, కాని కనుక్కున్నా తరువాత ఇక్కడ మరల Update చేసెదను.  

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

తిరుమల గిరులను ఎక్కుతు వుంటే /Thirumala girulanu ekkutu vunte

(ఆత్మాబలం  చిత్రం)  ఛిటపట చునుకులు పడుతూ ఉంటె .... పాత మాదిరిగా పాడాలి
This song should be sung with the tune of "Chitapata chinukulu" song from aatmabalam.


పల్లవి
తిరుమల గిరులను ఎక్కుతు వుంటే
శ్రీనివాసుడే కనపడుతుంటే
పాటలు పాడుచు భజనలు చేయుచు  …
గోవిందా అని పిలుస్తు ఉంటే 
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా  ఉంటుందోయి–- 2 --

చరణం: 1
రత్నకిరీటం తళతళమంటే  …….. ఆహహహ …
వజ్రకవచమే మెరుస్తూ ఉంటే  …….. ఓహో హో హో …
అన్ని మరిచి ఆ కొంతసేపు
ఆ స్వామిలో లీనం అవుతుంటే ….
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి–- 2 --   -- తిరుమల —

చరణం : 2
ఆ తిరుమల క్షేత్రము లోన  …… ఆహహహ …
దివ్యమైన ఆ రూపము తోడ …. ఓహోహోహో …
కలియుగంబునే కాచుట కొరకై
ఇలలో వెలసిన శ్రీరమణా
శ్రీనివాసుని నామం ఎంతో మధురంగా ఉంటుందోయి  …… --2-- -- Thirumala—


IN ENGLISH - Thirumala girulanu ekkutu vunte
Pallavi
Thirumala girulanu ekkutu vunte
Sreenivasude kanapadutunde
Paatalu paduchu bhajanalu cheyuchu …
Govindaa ani pilustu unte
Madhuramaina aa gaanam entho haayiga untundoyi –- 2 --
Charanam: 1
Ratna kireetam talatala mante …….. aaha ha ha…
Vajrakavachame merustu unte …….. oho ho ho…
Anni mariachi aa kontha sepu
Aa swamilo leenam avutunte….
Madhuramaina aa gaanam entho haayiga untundoyi –- 2 -- -- Thirumala—
Charanam: 2
Aa thirumala kshetramu lona …… aaha ha ha…
Divyamaina aa roopamu thoda …. Oho ho ho…
Kaliyugambune kaachuta korakai
Ilalo velasina sreeramaNaa
Sreenivasuni naamam entho madhuramu guntundoyi…… --2-- -- Thirumala—

ఏమీ సేతురా లింగా/Yemi seturaa lingaa

మాదేవ
ఈ పాటను ప్రముఖ గాయకుడు బాల మురళికృష్ణ గారు పాడినారు.
This song was sung by famous singer Bala Murali Krishna.

పల్లవి 
ఏమీ సేతురా లింగా, ఏమి సేతురా  --2--

చరణం : 1
గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు చేతమంటే,
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాయి లింగా,
మహానుభావా, మహా దేవ శంభో
మా లింగ మూర్తి                   -- ఏమి సేతురా --

చరణం : 2
అక్షయావుల పాలు  తెచ్చి, అర్పితము చేజేతమంటే
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాయి లింగా ,
మహానుభావా, మహా దేవ శంభో
మా లింగ మూర్తి                  -- ఏమి సేతురా --

చరణం : 3
తుమ్మ పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూజింతమంటే,
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా ,
మహానుభావా, మహా దేవ శంభో
మా లింగ మూర్తి                   -- ఏమి సేతురా --

IN ENGLISH - Yemi seturaa lingaa
Pallavi

Yemi seturaa lingaa, yemi seturaa --2--
Charanam: 1
Ganga udakamu techi neeku, linga poojalu chetamante,
Ganganunna chepa kappa yengilantunnaayi linga,
Mahaanubhaava, maha deva shambho
Maa linga murthi -- yemi seturaa--
Charanam: 2
Akshayaavula paalu techi, arpitamu chejetamante
Akshayaavula legaduDa yengilantunnaayi linga,
Mahaanubhaava, maha deva shambho
Maa linga murthi -- yemi seturaa--
Charanam: 3
Tumma poovulu techi neeku tushtuga poojintamante,
Komma kommaku koti tummeda yengilantunnayi linga,
Mahaanubhaava, maha deva shambho
Maa linga murthi -- yemi seturaa--

పవనాత్మజ నీ పావన నామము/Pavanatmaja nee

పల్లవి
పవనాత్మజ నీ పావన నామము ,
పలుమరు భాజియిన్తుము  రారా ,
మము పాలింపర భవసంహార         -- పవనాత్మజ --

చరణం: 1

ఏ వేళను నీ పావన నామము  -- 2 --
దేవా స్మరియిన్తుము రా రా
మము పాలింపర భవసంహార       -- పవనాత్మజ  --
చరణం : 2

దురిత విదూర దుఃఖ విధార
మారుతి ముదముతో ఇటు రా  రా
మము పాలింపర భవసంహార -- పవనాత్మజ --

చరణం : 3
శ్రీ ఆంజనేయ యువజన సంఘా
సంకట హర వరదా  వినోదా
మము పాలింపర భవసంహార -- పవనాత్మజ --
IN ENGLISH - Pavanatmaja nee paavana naamamu
Pallavi
Pavanaatmaja nee paavana naamamu,
Palumaru bhajiyintumu raaraa,
Mamu paalimpara bhava samhaara -- pavanaatmaja --
Charanam: 1
Ye veLanu nee paavana naamamu -- 2 --
Devaa smariyintumu raa raa
Mamu paalimpara bhava samhaara -- pavanaatmaja --
Charanam: 2
Duritha vidoora dukha vidhaara
Maaruthi mudamutho itu raa raa
Mamu paalimpara bhava samhaara -- pavanaatmaja --
Charanam: 3
Sree anjaneya yuvajana sanghaa
Sankata hara varada vinodaa
Mamu paalimpara bhava samhaara -- pavanaatmaja --


2, సెప్టెంబర్ 2010, గురువారం

జయ పాండురంగ ప్రభో విట్టలా/ Jaya Panduranga Prabho vittalaa

కరుణాoతరంగా

పల్లవి 
జయ పాండురంగ ప్రభో విట్టలా, జగదో ధారా, జయ విట్టలా
పాండురంగ విట్టలా, పండరినాథ  విట్టలా  --2--

చరణం : 1
శ్రీ రమణి హృదయాంత రంగా, మంగళకర కరుణాoతరంగా   --2--
ఆశ్రిత దీనజనావన రంగా --2--
ప్రభో పాండురంగ, విభో పాండురంగా    -- జయ పాండురంగ --

చరణం : 2
నీ కనులా చెలరేగే  వెలుగే, నీ పెదవుల అలలాడే నగవే, --2--
పాప విమోచన పాండురంగ --2--
ప్రభో పాండురంగ, విభో పాండురంగ  -- జయ పాండురంగ --

జయ పాండురంగ ప్రభో విట్టలా, జగదో ధారా , జయ  విట్టలా,
పాండురంగ విట్టలా, పండరి నాథ  విట్టలా --2--

విట్టలా విట్టలా……….. పాండురంగ
పాండురంగ  ……….. విట్టలా విట్టలా
రుక్మిణి నాథ  ……….. పాండురంగ
జ్ఞానాదేవ  ……….. పాండురంగ
రాధా రమణ  ……….. పాండురంగ
పాండురంగ  ……….. విట్టలా విట్టలా
విట్టలా విట్టలా……….. పాండురంగ    --పుండరీక వరదా గోవిందో హారి --
------------------------------------------------------------------------------
IN ENGLISH:
Pallavi

Jaya panduranga prabho vittalaa, Jagado dhaara, jaya vittalaa, Panduranga vittalaa, pandari natha vittalaa --2--

Charanam: 1
Sri ramani hrudayaantha ranga,
Mangala kara karunaa tharanga --2--
Aashritha deena janaa vana rangaa --2--
Prabho panduranga, vibho pandurangaa -- Jaya Panduranga--

Charanam: 2
Nee kanula chelarege veluge, nee pedavula alalaade nagave, --2--
Papa vimochana panduranga --2--
Prabho panduranga, vibho panduranga  -- Jaya Panduranga--

Jaya panduranga prabho vittalaaa, Jagado dhaara, jaya vittalaa,
Panduranga vittalaa, pandari natha vittalaa --2--
Vittalaa vittalaa ……….. panduranga
Panduranga ……….. vittalaa vittalaa
Rukmini naatha ……….. panduranga
Gnanaadeva ……….. panduranga
Radha ramana ……….. panduranga
Panduranga ……….. vittalaa vittalaa
Vittalaa vittalaa ……….. panduranga  --Pundareeka varadaa govindo haari--

25, ఆగస్టు 2010, బుధవారం

16, మార్చి 2010, మంగళవారం

Vikruthi naama samvatsara shubhakankshalu

మీ అందరికి,
వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.
ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాలలో సంతోషం, ఆరోగ్యం, వృద్ధి తీసుకురావాలని ఆశిస్తున్నాను.

6, జనవరి 2010, బుధవారం

Maha Mrutyunjaya Mantram

In Hindi
ॐ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम
उर्वारुकमिव बंधनात मृत्योर्मुक्षीय मामृतात ॐ

In Telugu
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మ్రిత్యోర్ముక్షియ మమ్రితాత్  ఓం

In English
Om Trayambakam Yajamahe Sugandhim Pushtivardhanam
Urvarukamiva Bandhanat Mrityormukshiya Mamritat Om

Happy New Year 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2010
ఈ కొత్తసంవత్సరం లో అందరూ ఆయువు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

LinkWithin

Related Posts with Thumbnails