22, డిసెంబర్ 2010, బుధవారం

పిల్లలకు సంబంధమైనవి - Children related

 చిన్నపిల్లలకు సంబందించినవి మన సాంప్రదాయం లో చాలా ఉన్నాయి. అందులో నాకు తెలిసినవి, కొన్ని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.

పిల్లలకు స్నానం చేయించిన తరువాత
స్నానం ముగించేటప్పుడు ఆ బుచ్కేట్ లో ఆఖరున కొన్ని నీళ్ళు ఉంచి,చెంబులో కొన్ని నీళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ ఈ క్రింద చెప్పినట్టు అనాలి :
జోత పోత జోన్నారి పోత , (అమ్మాయి/అబ్బాయి పేరు చెప్పి) చుసిన వాళ్ళంతా రోత రోత
(ఈ క్రింద అంటూ పిల్లల  చేతిని దండం పెడుతున్నట్టు చేసి )రాజ రాజేశ్వరుడికి జేజ, తిరుపతి వెంకన్నకు జేజ, అలమేలు మంగన్నకు జేజ, పద్మావతి కి జేజ, ముక్కోటి దేవతలకు జేజ ముక్కోటి దేవతలకు జేజ, ముక్కోటి దేవతలకు జేజ .
లేదా ఈ క్రింద రాసిన విధంగా అంటూ చేతిలో నీళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ తిప్పుతూ అనాలి
"శ్రీరామ రక్షా నూరేళ్ళు ఆయుష్షు "

LinkWithin

Related Posts with Thumbnails