4, ఆగస్టు 2011, గురువారం

కేశవా నారాయణా ..... మాధవా మము బ్రోవరా

కేశవా నారాయణా  ..... మాధవా మము బ్రోవరా ..
కేశవా నారాయణా ..... ఆ  ఆ  ఆ 

చరణం :1
పాల సంద్రమును తరచేది వేళ  --2--
మందరగిరినే మూపున మోసావు    --2--
నన్ను బ్రోవగా భారమైతినా  --2--
కావగా రావేల శ్రీవేణుగోపాలా       -- కేశవా --

చరణం : 2
కృష్ణా యనగానే వలువల నొసగి  --2--
ద్రౌపథి మానము కాపాడినావు
మాధవా అని ఎలుగెత్తి వేడగా --2--
కావగా రాలేదా కరిరాజు నానాడు        -- కేశవా --

చరణం : 3
గోవర్ధనగిరి గీతన నిలిపి  --2--
గోకుల వేలల్లర కాపాడినావు  --2--
నన్ను బ్రోవగా  భారమైతినా  --2--
కావగా రావేల శ్రీవేణుగోపాలా      -- కేశవా--

IN ENGLISH:

keshavaa narayanaa ..... madhavaa mamu brovaraa..
keshavaa narayanaa..... aa aa aa

charanam:1
paala sandramunu tarachedi veLa --2--
mandaragirine moopuna mosaavu   --2--
nannu brovagaa bhaaramaithinaa --2--
kaavaga raavela sreevenugopaalaa        -- keshavaa--

charanam: 2
krishnaa yanagaane valuvala nosagi --2--
draupathi maanamu kaapaadinaavu
maadhavaayani elugethi vedagaa --2--
kaavaga raleda kariraju naanaadu       -- keshavaa--

charanam: 3
govardhanagiri geetana nilipi --2--
gokula velallara kaapaadinaavu --2--
nannu brovagaa bhaaramaithinaa --2--
kaavaga raavela sreevenugopaala    -- keshavaa--

అమితానందం పరమానందం అయ్యప్పా

అమితానందం పరమానందం అయ్యప్పా 
నీ రూపము చుసిన పాపం తొలగును అయ్యప్పా 
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప .....           -- అమితానందం --

చరణం : 1
పుట్టుట పంబా తీరం  ...... హో  హో  
పెరుగుట పందల రాజ్యం           --2--
కంటమందు మణిహారం, మనికంట నీ నామం   --2--

అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప .....           -- అమితానందం --


చరణం : 2
హరియే మోహిని రూపం, హో  హో .....
హరయే మోహన రూపం          --2--
హరిహరాదుల సంభవమే, అయ్యప్పా అవతారం  --2--
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప .....           -- అమితానందం --

IN ENGLISH:
amithanandam paramaanandam ayyappaa
nee roopamu chusina paapam tolagunu ayyappaa
ayyapaa.....swamy, ayyappa........
ayyappa..... saranam, ayyappa.....           -- amithanandam--

charanam: 1
puttuta pambaa teeram ...... ho ho 
peruguta pamdala raajyam          --2--
kantamandu manihaaram, manikanta nee naamam  --2--
ayyapaa.....swamy, ayyappa........
ayyappa..... saranam, ayyappa.....           -- amithanandam--

charanam: 2
hariye mohini roopam, ho ho.....
haraye mohana roopam         --2--
hariharaadula sambhavame, ayyapaa avataaram --2--
ayyapaa.....swamy, ayyappa........
ayyappa..... saranam, ayyappa.....           -- amithanandam--

అందరు కలిసి భజన చేసితే, ఎందుకు రాడే సాయిరాం

అందరు కలిసి భజన చేసితే, ఎందుకు రాడే సాయిరాం   --2--
సాయి నీవే దిక్కని వెడితే, ఎందుకు రాడే సాయిరాం      --2--

చరణం :1
ఆ ప్రహ్లాదుడు హరి హరి అనగా, స్తంబము నందుదయించే కదా 
హరి హరి నీవే దిక్కని వేడిన, ఎందుకు రాడే సాయిరాం      -- అందరు  --

చరణం : 2
ద్రుపతిదేవి కృష్ణ యనగా, వలువలోసంగిన పరమాత్మా 
సాయి నీవే దిక్కని వేడిన, ఎందుకు రాడే సాయిరాం           -- అందరు  --

చరణం :3
ఆ కరి రాజు హరి హరి అనగా, చక్రము వదిలి కాచేకదా 
సాయి నీవే దిక్కని వేడిన, ఎందుకు రాడే సాయిరాం            -- అందరు  -- 

IN ENGLISH:

andaru kalisi bhajana chesithe, enduku raade sairaam  --2--
saai neeve dikkani vedithe, enduku raade sairaam       --2--

charanam:1
aa prahladudu hari hari anagaa, stambamu nandudayinche kada
hari hari neeve dikkani vedina, enduku raade sairaam             -- andaru --

charanam: 2
draupathidevi krishna yanagaa, valuvalosangina paramaatmaa
sai neeve dikkani vedina, enduku raade sairaam             -- andaru --

charanam:3
aa kari raju hari hari anagaa, chakramu vadili kaache kadaa
sai neeve dikkani vedina, enduku raade sairaam             -- andaru --

3, ఆగస్టు 2011, బుధవారం

మనసున నీ నామమేరా, నా కన్నుల నీ రూపమే రా

పల్లవి
మనసున నీ నామమేరా, నా కన్నుల నీ రూపమే రా 

చరణం : 1
ఆపదలలో నీకు అందించు మా సిరులు  --2--
ఆ సిరులలో నీకు అతి ప్రీతి మా కురులు 
ఆదుకో మనగానే అందించు నీ కరము 
అతిలోక సుందరమూ మణిమయ భుశితము -- 2 --    --మనసున --

చరణం : 2
కలిలో నీవే కనిపించు దైవము  --2--
పిలిచినా పలికే ప్రేమాస్పదుడవు
కావగరావేల, జాగేలనయ్య  --2--
అలివేలు మంగమ్మ అనుమతి కావలెనా  --2--        -- మనసున --

IN ENGLISH:

Manasuna nee naamameraa, naa kannula nee roopame raa

Charanam: 1
aapadalalo neeku andinchu maa sirulu --2--
aa sirulalo neeku athi preethi maa kurulu
aaduko managaane andinchu nee karamu
athiloka sundaramu maNimaya bhushithamu -- 2 --    --manasuna --

Charanam: 2
kalilo neeve kanipinchu daivamu --2--
pilichina palike Premaaspadudavu
kaavaga raavela, jaagelanayya --2--
alivelu mangamma anumathi kaavalenaa --2--        -- manasuna-

హర, హర, హర, హర, మహాదేవా

హర, హర, హర, హర, మహాదేవా  --2--
శివ, శివ, శివ, శివ సదాశివా           --2--

చరణం:1
నందివాహనా నాగాభరణా         --2--
గంగాధరా హర, జటాధరా           --2--
శ్రీశైలవాసా  శ్రీమల్లికార్జున           --2--
భ్రమరాంబా ప్రియ మనోహరా      --2--
మనోహరా, మహాదేవా               --2--                 --హర  --

చరణం:2
కాలకాలహర, సదా శివా            --2--
కాశీవిశ్వేశ్వర సదా శివా             --2--
సదాశివ, మహాదేవా                  --2--
రారా శివ, రావా శివా                 --2--

రత్నాల మేడ దిగి, రావా శివా 
ముత్యాల మేడ దిగి, రావా శివా 
కొండా కొండలు దిగి, రావా శివా 
వెండి కొండలు దిగి, రావా శివా 
రా రా శివా, రావా శివా 

చరణం: 3
డం, డండండం, డమరు భజే      --2--
భం, భంభంభం పశుపతే            --2--
ఘణఘణఘణఘణ ఘంటాభజే   --2--
భోలనాథ ఉమాపతే 
ఉమాపతే, పశుపతే                            -- హర --

IN ENGLISH:

hara, hara, hara, hara,  mahadevaa             --2--
shiva, shiva, shiva, shiva sadaa shivaa         --2--

Charanam:1
nandi vaahanaa naagaabharaNaa          --2--
gangaadharaa hara, jaTaadharaa          --2--
Srisailavaasa srimallikarjunaa               --2--
bhramaraamba priya manoharaa          --2--
manoharaa, mahaadevaa                     --2--                 --hara --

Charanam:2
kaalakaalahara, sadaa shivaa              --2--
kaashivishveswara sadaashiva            --2--
sadaashiva, mahaadevaa                    --2--
raa raa shiva, raavaa shiva                 --2--

ratnaala meda digi, raavaa shiva
mutyala meda digi, raavaa shiva
kondaa kondalu digi, raavaa shiva
vendi kondalu digi, raavaa shiva
raa raa shiva, raavaa shiva

Charanam: 3
Dam, Dam, Dam, Dam, Damaru bhaje          --2--
bham, bham, bham, bham pashupathe           --2--
ghaNa, ghaNa, ghaNa, ghaNa ghantaabhaje --2--
bhoLanaatha umaapathe
umaa pathe, pashupathe                           -- hara --

కరుణించు పరమేశ్వరి, అనవరతంబు నీ సేవా

కరుణించు పరమేశ్వరి, అనవరతంబు నీ సేవా 
లోనరించు భాగ్యము, కలిగించు జగదీశ్వరి          -- కరుణించు  --

చరణం : 1
సప్తస్వర నాదవినోదిని, సౌభాగ్య సమేత సుద్రుపిని
అఘనాషిని  .... నిటలాక్షిని ... సర్వాలంకార సుశోభిత మంగళా 
కరిరాజ, రాజేశ్వరి..... అనవరతంబు నీ సేవలోనరించు  భాగ్యము 
కలిగించు జగదీశ్వరి  .......                                  -- కరుణించు  ---

చరణం : 2
మరచు దానని నన్ను అరమరసేయకు         -- 2--
మరపు మరిపించి కరుణించవే అమ్మ          -- మరచు --
స్తిరతాన మది నిలిచి , త్వరగా అక్కున చేర్చి   -- 2--
స్వరలహరిలో నిను స్తుతిచేయు  భాగ్యము 
కలిగించు జగదీశ్వరి, అనవరతంబునే సేవ లోనరించు భాగ్యము 
కలిగించు జగదీశ్వరి ....                                        -- కరుణించు  --


IN ENGLISH:
Karuninchu parameshwari, anavaratambu nee sevaa
lonarinchu bhagyamu, kaliginchu jagadeeshwari         -- karuninchu --

Charanam: 1
saptaswara naadavinodini, sowbhagya sametha sudrupiNi
aghanaashini .... nitalaakshiNi... sarvaalankaara sushobhitha mangalaa
kariraaja, raajeshwari..... anavaratambu nee seva lonarinchu bhagyamu
kaliginchu jagadeeshwari .......                                  -- karuninchu ---

Charanam: 2
marachu' daanani nannu aramaraseyaku        -- 2--
marapu maripinchi karuninchave amma         -- marachu--
stirataana madi nilachi, twaragaa akkuna cherchi  -- 2--
swaralaharilo ninu stuthi cheyu bhagyamu
kaliginchu jagadeeshwari, anavaratambune seva lonarinchu bhagyamu
kaliginchu jagadeeshwari....                                        -- karuninchu --

27, జులై 2011, బుధవారం

మాతంగ వదనా ఆనంద సదనా


పల్లవి
మాతంగ వదనా ఆనంద సదనా 
మహా దేవాశివ శంభో నందన -- మాతంగ --
 చరణం: 1
మాయ వినాశక మూషిక వాహన --2 --
మాత మాహేశ్వరి భవాని నందన 
మహా గణపతే మంగళ చరణా -- మాతంగ --
 చరణం: 2
ప్రథమ పూజిత ప్రభో గజానన 
పాహి ప్రభో మాంపాహి ప్రభో, మాం పాహి గజానన 
పాశకుటార పరాంకుష పాణే -- మాతంగ --

IN ENGLISH
maatanga vadanaa aananda sadanaa
mahaa devaashiva  shanbho  nandana -- maatanga --

charanam: 1
maaya vinaashaka mushika vaahana --2 --
maata maheshwari bhavani nandana
maha gaNapathe mangaLa charaNaa -- maatanga --

charanam: 2
prathama pujitha prabho gajaanana
paahi prabho maampaahi  prabho, maam paahi gajaanana
paasha kuTaara paraankusha paaNe -- maatanga --

పదే పదే పాడేము నీ పావన గీతం

పల్లవి: 
పదే  పదే పాడేము నీ పావన గీతం    
గజ ముఖవరద  గణపతి దేవా  --2 -- 

చరణం : 1
ఇలలోన నీ పూజ  ప్రథమంబు కాదా 
కలలోన నీ మూర్తి  కనువిందు కాదా 
కలనైన నీ మూర్తి ఓ ఓ ......
కలయైయ రేయైనా నీ నామమేరా గణపతి దేవ -- పదే  పదే --

చరణం : 2
మదిలోన నీ నామం మరువము  రా  రా  
హృదిలోన  నీ  రూపం కొలిచేము రా రా 
గజముఖ వరదా ...
గజముఖ వరదా ... కరుణా భరణా గణపతి దేవా  -- పదే  పదే --


IN ENGLISH:
pade pade paademu nee pavana geetham 
gaja mukhavarada ganapathi devaa --2 -- 

charanam: 1
ilalona nee pujka prathamanbu kaada
kalalona nee murthi kanuvindu kaada
kalanaina nee murthi oh oh ......
kalayaiya reyaiya nee naamamera ganapathi deva -- pade pade--

charanam: 2
madilona nee naamam maruvamu raa raa 
hrudilona nee roopam kolichemu raa raa
gajamukha varadaa...
gajamukha varadaa... karuNaa bharaNaa ganapathi devaa -- pade pade--

6, మే 2011, శుక్రవారం

అక్షయ త్రితీయ - Akshaya Triteeya

అక్షయ త్రితీయ అనేది ఒక పర్వదినం . ఈ రోజున చాల మంది బంగారం కానీ వెండి కానీ లేక ఏ ఇతర వస్తువు కానీ భూమి కానీ కొంటారు. ప్రజల నమ్మకం ప్రకారం ఈ రోజున ఏమి చేసిన అది అక్షయం కింద అవుతుందని. అంటే అది ఎప్పుడు తరిగిపోకుండా ఉంటుందని నమ్మకం. ఖర నామ సంవత్సరం లో ఈ రోజున అక్షయ త్రితీయ వొచింది. అందరికి అక్షయ త్రితీయ మంచిని తేవాలని ఆశిస్తూన్నను.

Alshaya triteeya is a auspicious day according to hindu mythology. On this day lot of people try to buy gold, silver or any other properties. It is believed that whatever we start or buy this day will become "akshayam", meaning everlasting, imperishable. Today is akshaya triteeya in 2011. So I wish you all prosperity and happiness which stays everlasting.       

10, మార్చి 2011, గురువారం

స్నానం - Bath

స్నానం చేసేటప్పుడు ఈ క్రింద శ్లోకం అనాలి :

గంగే చ యమునే చ గోదావరి చ సరస్వతి 
నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం  

మా నాయనమ్మ ఎప్పుడు అంటుండగా వినేదాన్ని, అలా ఒక పుస్తకం లో కూడా ఈ మధ్య చదివి గుర్తుకు వొచ్చి, రోజూ స్నానం చేసేటప్పుడు అనటానికి తరచూ చూస్తున్నాను. ఈ స్తోత్రం స్నాననికే కాకుండా దేవుడికి నీళ్ళు అర్పించేతప్పుడు కుడా అంటారు. దాని అర్థం ఏమనగా.... దేశంలో ఉన్న అన్ని నదుల నీళ్ళు ఈ నీళ్ళలో ఉండుగాక అని లేక వాటి పవిత్రత ఈ నీటిలో వోచుగాక అని అర్థం.
తలస్నానం వారంలో రెండు రోజులు శ్రేష్టం. బుధవారం మరియు శనివారం.

ప్రతి పండుగనాడు (అది బుధ, శని వారం కాకున్నా కూడా) తల స్నానం చేయవొచ్చు. నాకు గుర్తు ఉన్నంత మటుకు కేవలం ఒక్క మహా శివరాత్రి నాడు మాత్రం తల స్నానం చేయరాదని చెప్పేవారు. దానికి కారణం ఏమని చెప్పేవారు అంటే, ఆనాడు  తల స్నానం చేస్తే మనం తల స్నానం చేసిన నీరు దేవుని (శివుడి) మీద పడుతుంది అనేవారు. అది మంచిది కాదు అని చెప్పేవారు. ఇది నేను కేవలం చిన్నప్పుడు విన్నాను. అది కనక తప్పి ఉంటె క్షమించండి.

మన సంప్రదాయంని మర్యాదలు నిలుపుదామని చిన్న కోరిక, తపన, ఆశ మరియు ప్రయత్నం. ఈ చిన్ని ప్రయత్నంలో ఎవైన లోపాలు కనిపించినా, తప్పులు కనిపించినా సవరిస్తారని ఆశిస్తూ.....


-------------
The following is the stotra which my grand mother used to chant while taking bath/shower:
 
Gange cha Yamune cha godavari cha saraswathi,
Narmadaa sindhu kaveri jalesmin sannidhim kurum...
 
What this means is : may all the sacred rivers in India like Ganga, Yamuna, Godavari etc all are in this water for purity. This mantram is also said when offering water to god.
 
Head bath should be taken on following two days of the week: Wednesday and Saturday.
 
Apart from above mentioned days, head bath is done on all the festivals (irrespective of day of week) except Maha Shivratri. These are all the things which I heard during my childhood. If you find any mistakes in it, then please correct it.
 
This is just a small struggle to make our tradition, culture stay alive, even with the newer generations coming. If you find any mistakes or faults, please point it out, so that I can correct them.

LinkWithin

Related Posts with Thumbnails