పల్లవి
వేడుకుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని , వేడుకుందామా ||2||
చరణం:1
ఆమటి మ్రొక్కుల వాడే ఆది దేవుడే
వాడు తోమని పల్యాల వాడే దురిత దూర్యుడే ||వేడుకుందామా||
చరణం: 2
వడ్డీ కాసులవాడే వనజనాభుడే
పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే ||వేడుకుందామా||
చరణం: 3
ఎలిమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్మంగా శ్రీ వెంకటాద్రి నాథుడే ||వేడుకుందామా||
Pallavi
Vedukundaama Venkatagiri Venkateshwaruni, Vedukundaama
Charanam: 1
aamati mrokkula vade, aadi devude
vadu thomani palyaala vade duritha duryude || Vedukundama||
Charanam: 2
Vaddi kaasula vade, vanaja naabhude
puttu godrallaki biddalichche govindude ||Vendukundama||
Charanam:3
Elimi korina varaaliche devude,
vadu alamelmanga sri venkataadri naathude || Vedukundama||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి