ఏ కడ నున్నా ఏకాంతమే
ఏక భక్తిని జగము ఈశ్వర మయమనుచు
డీకొని తెలిసిన ధీశాలికి నిక ........
చరణం: 1
లో చూపులో నిన్నే లోకమ్ముగా నెంచి
యోచించి ఎరిగిన యోగ నిరతులకు ..... (లో చూపులో ...)
-- ఏ కడ నున్నా ఏకాంతమే --
చరణం: 2
లోక చింతల వదిలి లోలాటల దిగ విడచి
నీ కరుణచే మదిని నిలిపి కొలిచెడి మునులకు ... (లోక చింతల .......)
-- ఏ కడ నున్నా ఏకాంతమే --
చరణం: 3
నిను వినా మది ఏది నిజముగా లేదని
కనుగొని మురిసెడి ఘన శివ యోగికి ... (నిను వినా .......)
-- ఏ కడ నున్నా ఏకాంతమే --
చరణం: 4
రెంటి నంటక నిలిచి రేపగలు నీ పదము
నంటి మెలగెడి షణ్ముఖరిచితుని (రెంటి నంటక .......)
భక్తులకు ...
-- ఏ కడ నున్నా ఏకాంతమే --
In English
Ye kada nunna yekanthame
yeka bhakthini jagamu eeshwara mayamanuchu
deekoni telisina Dheeshaliki nika ... (Ye kada ...)
Charanam: 1
lo choopulo ninne lokammuga nenchi
yochinchi erigina yoga nirathulaku ... (lo choopulo ...)
-- Ye kada nunna yekanthame --
Charanam: 2
lokachinthala vadili lolatala diga vidachi
nee karunache madini nilipi kolichedi munulaku ... (loka chinthala ...)
-- Ye kada nunna yekanthame --
Charanam: 3
Ninu vinaa madi yedi nijamuga ledani
kanugoni murisedi ghana Shiva yogiki ... (Ninu vinaa ...)
-- Ye kada nunna yekanthame --
Charanam: 4
Rentinantaka nilachi repagalu nee padamu
nanti melagedi shanmukharchituni bhakthulaku ... (Rentinantaka nilachi ...)
-- Ye kada nunna yekanthame --
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి