ఇది అమ్మాయిలు ఆడవాళ్ళ పండుగ. బతుకమ్మ దసరా నవరాత్రులలో మొదలు అవుతుంది. అమావాస్య రోజున మొదలుకొని దసరా ముందు రోజు వరకు సాగుతుంది.
పువ్వులను ఒక కుప్పలాగా పేర్చి, గౌరమ్మను చేసి ఆ పేర్చిన పువ్వులపైనా పెడతాము. బతుకమ్మ తల్లిని " తల్లి మమ్మల్ని చల్లగా చూడు అని" పాటలతో బతుకమ్మల చుట్టూ చప్పట్లతో లేక కోలాటంతో స్మరిస్తాము. చివరగా రోజు ముగియగానే నీటిలో అమ్మవారిని అనిపి "పో పో బతుకమ్మ పోదున్నే రా " అని తొమ్మిది రోజులు అమ్మవారికి వీడుకోలు పలుకుతాము. చివరి రోజు "పో పో బతుకమ్మ మల్లేదు రా " అని బతుకమ్మ ను వచ్చే యేడు తప్పకుండా రమ్మనమని పిలుచు కుంటాము.
కింద చూపినది మా ఇంట్లో ఈ యేడు జరిగిన బతుకమ్మ పూజ అప్పటిది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి