ఆది మూలమే మాకు అంగ రక్షా
త్రి దేవుడే మాకు జీవ రక్షా
మాకు అంగ రక్షా , మాకు జీవ రక్షా
చరణం: 1
భూమిదేవి పతియైన పురుషోత్తముడే మాకు,
భూమిపై ఏడనుండిన భూమి రక్షా
ఆమని జలధి సాయి ఐన దేవుడే మాకు,
సామీప్య మందున్న జల రక్షా
మాకు భూమి రక్షా, మాకు జల రక్షా
చరణం: 2
మ్రోయుచు అగ్నిలో యజ్ఞ మూర్తియైన దేవుడే ,
ఆయములు తాకకుండా అగ్ని రక్షా
వాయు సుతునేలినట్టి వనజ నాభుడే మాకు -- 2--
వాయు నందు కందకుండ వాయు రక్షా
మాకు అగ్ని రక్షా మాకు వాయు రక్షా
చరణం : 3
పాదమాకాశమునకు పారజాచే విష్ణువే
గాదిలియై మాకు ఆకాశ రక్షా
సాధించి శ్రీ వేంకటాద్రి సర్వస్వరూపుడే మాకు
సాధరము మీరినట్టి సర్వ రక్షా
In English -
Aadi moolame maaku anga raksha
Tri-devude maaku jeeva raksha
maaku anga raksha , maku jeeva raksha
Charanam: 1
Bhoomidevi pathiyaina purushotamude maku
bhoomi pai yedanundina Bhoomi raksha
aamani jaladhisai aina devude maaku
sameepyamandunna jala raksha
Maku jeeva raksha , maku jala raksha
Charanam: 2
mroyuchu agnilo yagnamurthaina devude
aayamulu daakakunda agni raksha
vaayusutu nelinatti vanaja nabhude maaku -- 2--
Vaayu nandu kandakunda vaayu raksha
maku agni raksha, maku vayu raksha
Charanam: 3
paadamaakaashamunaku parajache vishnuve
gaadiliyai maku aakasharaksha
saadhinchi sri venkatadri sarva swaroopude maku
saadaramu meerinatti sarva raksha
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి