పల్లవి
రఘురాము లంపేనమ్మా - మీ జాడలో వచ్చితినిదిగో కొమ్మా -- రఘురాము --
అను పల్లవి
కామిని నా మాట కల్లా కాదు రామా
స్వామి పాదము తోడు - సంశయింపకు తల్లి -- రఘురాము --
చరణం: 1
నెలకు రమ్మని చెప్పెను - సుగ్రీవుని నేరకులన్నిట దప్పెను
కుల గ్రామారణ్యములు కలియ దిరుగుచురాంగా
మిలలోన మా కష్టమిపుడే ఫలించేను -- రఘురాము --
చరణం: 2
అల దుఃఖ సుఖములన్ని దేవునికైనా అనుభవింపక తీరునా
బలరక్కసుని లంక - పాడు పాడుగజేసి
జలజాక్షి నీ విభుడు సత్యముగా నిన్నేలు -- రఘురాము --
చరణం: 3
తలచి చూడుము ఇదిగో - మా మంథెన్న దేవునుఁగరమిదిగో
తలపున వెరువాక ధైర్యామొందవే తల్లి
కలువరింపుచు నిన్ను ఘడియైనా మరువడు -- రఘురాము --
In English
Pallavi
Raghuramu lampenamma - nee jaadalo vacchithi nidhigo komma -- Raghuramu --
Anupallavi
Kaamini naa maata - kalla kaadu raama
swami paadamu thodu - samshayimpaku talli
Charanam: 1
nelaku rammani cheppenu - sugreevuni nerakulannita dappenu
kula graamaraNyamulu - kaliyadiruguchu raanga
milalona maa kashta mipude phalinchenu -- Raghuramu --
Charanam: 2
ala dukha sukhamulanni - devuni kaina anubhavimpaka teerunaa
bala rakkasuni lanka, paadu paaduga jesi
jalajakshi nee vibhudu satyamuga ninnelu -- Raghuramu --
Charanam: 3
tarachi chudumu idhigo - maa manthena devu nungara midhigo
talapuna veruvaka dhairya mondave talli
kaluvarimpuchu ninnu ghadiyaina maruvadu -- Raghuramu --
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి