Pandugalu -పండుగలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pandugalu -పండుగలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జనవరి 2013, ఆదివారం

Karthika deepam

కార్తీక మాసం హిందువులకు చాలా శ్రేష్టమైన మాసం. భారత దేశం లో, ముఖ్యంగా దక్షిణ భారతం లో ఈ మాసం పౌర్ణమి రోజున కోవెల(గుడి) వెనక ఉన్న కోనేటిలో (చిన్న నీటి ప్రదేశం) దీపాన్ని ఒక ఆకులో పెట్టి నీటిలో వదులుతారు. ఆ నీటిలో కుంకుమ , పసుపు, అక్షింతలు వేసి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఇది మన ప్రాచీన సంప్రదాయం అని నాకు గుర్తు. కానీ దాని మిగితా వివరాలు తెలియదు. నాకు మరిన్ని వివరాలు తెలిసిన, నేను మళ్ళి  ఈ బ్లాగ్ లో జత చేసెదను.

అమెరికాలో అలా కోనేరు ని నేను చూడలేదు. కనుక ఇంటిలో ఒక స్టీల్ పాత్రలో నీటిని నింపి, అందున నీటి పైన తేలే దీపాన్ని వెలిగించాను. మీరు కూడా మరల వొచ్చే ఏడాదిలో, మీకు అనుకూలంగా ఉన్నప్పుడు, ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు అని ఆశిస్తున్నాను.
In English:
In the lunar month of Kartheeka maasam (one of the telugu month, which comes in November/December timeframe), it is one of the old rituals to leave a deepam in the small pond behind the temple. Put some kumkum, turmeric and akshintalu(turmeric added to rice with a pinch of ghee).

Since in America we do not have any ponds near the temples, I have done kind of like it at home, in front of the god's place. Took a small steel vessel and filled with water. Added the floating candle to it and some kumkum, turmeric and prayed to god. I hope you find this solution easier too and follow it from next year. Good Luck !!!!

6, మే 2011, శుక్రవారం

అక్షయ త్రితీయ - Akshaya Triteeya

అక్షయ త్రితీయ అనేది ఒక పర్వదినం . ఈ రోజున చాల మంది బంగారం కానీ వెండి కానీ లేక ఏ ఇతర వస్తువు కానీ భూమి కానీ కొంటారు. ప్రజల నమ్మకం ప్రకారం ఈ రోజున ఏమి చేసిన అది అక్షయం కింద అవుతుందని. అంటే అది ఎప్పుడు తరిగిపోకుండా ఉంటుందని నమ్మకం. ఖర నామ సంవత్సరం లో ఈ రోజున అక్షయ త్రితీయ వొచింది. అందరికి అక్షయ త్రితీయ మంచిని తేవాలని ఆశిస్తూన్నను.

Alshaya triteeya is a auspicious day according to hindu mythology. On this day lot of people try to buy gold, silver or any other properties. It is believed that whatever we start or buy this day will become "akshayam", meaning everlasting, imperishable. Today is akshaya triteeya in 2011. So I wish you all prosperity and happiness which stays everlasting.       

5, నవంబర్ 2010, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు (2010)

మీ అందరి మీద ఆ లక్ష్మి దేవి కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ,
మీ అందరికి మరియు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు.
- శిరీష

12, అక్టోబర్ 2010, మంగళవారం

దసరా - జమ్మి చెట్టు (Dasara - Jammi Chettu)

జమ్మి చెట్టు మన ప్రాచీన సంప్రదాయంలో ఒక విశిష్టమైన చోటు కలది. దసరా నవరాత్రులలో, నవరాత్రి ఆఖరి రోజు అనగా దసరా పండుగ రోజు, సాయంత్రం పూట జమ్మి ఆకులను కోస్తారు. కొన్ని జమ్మి ఆకులు అక్షింతలు పెద్ద వాళ్ళ చేతిలో ఉంచి, వారి నుండి ఆశీర్వాదం తీసుకోవటం మన సాంప్రదాయం.  అది ఎందుకు అలా చేస్తారో కారణం నాకు తెలియదు, కాని కనుక్కున్నా తరువాత ఇక్కడ మరల Update చేసెదను.  

21, సెప్టెంబర్ 2009, సోమవారం

దసరా నవరాత్రులు

మన ముఖ్యమైన పండుగలలో ఒకటి దసరా. ఈ పండుగ నవరాత్రులు అమ్మవారిని పూజించిన తరువాత పదవరోజున పండుగగా జరుపుకుంటాము. ఐతే తెలుగు తిథుల ప్రకారం ప్రతి ఏడాది ఈ పండుగ రోజులు మారుతూ ఉంటాయి.
అప్పుడప్పుడు రెండు తిథులు ఒకే రోజు రావటం కూడా జరుగును. అలంటి అప్పుడు ఇద్దరు అమ్మవరులది నామాలు వల్లించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.

ప్రతి రోజు అమ్మవారి ఒక్కొక్క రూపాన్ని పూజించుకుంటాము. క్రింద పేర్కొన్న విధముగా ఒక్కో రోజు ఒక్కో అమ్మవారిని పూజించి, అమ్మవారి నామాలు చదివి, ఆ యా దేవి కరుణను కురిపించమని వేడుకుంటాము. (క్రింద పేర్కొనిన అమ్మవారి రోజులు, వేరే దగ్గర నుండి సేకరించినది. )
మొదటి రోజు - శ్రీ దుర్గ అమ్మవారు
రెండవ రోజు - శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి
మూడవ రోజు - శ్రీ అన్నపూర్ణా మాత
నాలుగవ రోజు - శ్రీ గాయత్రీ దేవి
ఐదవ రోజు - శ్రీ లలిత దేవి
ఆరవ రోజు - శ్రీ మహాలక్ష్మి దేవి
ఏడవ రోజు - శ్రీ సరస్వతి దేవి
ఎనిమిదవ రోజు - శ్రీ మహిషాసుర మర్ధిని దేవి
తొమ్మిదవ రోజు - శ్రీ రాజ రాజేశ్వరి దేవి

బతుకమ్మ - batukamma

బతుకమ్మ
ఇది అమ్మాయిలు ఆడవాళ్ళ పండుగ. బతుకమ్మ దసరా నవరాత్రులలో మొదలు అవుతుంది. అమావాస్య రోజున మొదలుకొని దసరా ముందు రోజు వరకు సాగుతుంది.
పువ్వులను ఒక కుప్పలాగా పేర్చి, గౌరమ్మను చేసి ఆ పేర్చిన పువ్వులపైనా పెడతాము. బతుకమ్మ తల్లిని " తల్లి మమ్మల్ని చల్లగా చూడు అని" పాటలతో బతుకమ్మల చుట్టూ చప్పట్లతో లేక కోలాటంతో స్మరిస్తాము. చివరగా రోజు ముగియగానే నీటిలో అమ్మవారిని అనిపి "పో పో బతుకమ్మ పోదున్నే రా " అని తొమ్మిది రోజులు అమ్మవారికి వీడుకోలు పలుకుతాము. చివరి రోజు "పో పో బతుకమ్మ మల్లేదు రా " అని బతుకమ్మ ను వచ్చే యేడు తప్పకుండా రమ్మనమని పిలుచు కుంటాము.
కింద చూపినది మా ఇంట్లో ఈ యేడు జరిగిన బతుకమ్మ పూజ అప్పటిది

నా కూతురి మొదటి బతుకమ్మ అవటం వల్ల, బతుకమ్మకి నైవేద్యంగా పచ్చి పిండి లడ్డూ, నువ్వు పిండి లడ్డూ, పెసరు పిండి లడ్డూ, పెసరుతో గారెలు నైవేద్యంగా పెట్టాము. కింది ఫోటోలో అవే కాకుండా, ఖోవా లడ్డూ మరియు పెసరు పప్పు కొబ్బరి, పచ్చిమిర్చి ఉప్పు కలిపిన ప్రసాదం కూడా ఉంది.


LinkWithin

Related Posts with Thumbnails