ముద్దుగారి యశోద, ముంగిట ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడూ ||ముద్దుగారి యశోద||
చరణం: 1
అంతలింత గొల్లెతల, అరచేతి మాణిక్యము
పంతమడే కంసుని పాలి వజ్రమూ
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూసా
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు ||ముద్దుగారి యశోద||
చరణం: 2
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
ఇది గోవర్ధనపు గోమేధికము
శతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ముల కాచే కమలాక్షుడు ||ముద్దుగారి యశోద||
చరణం: 3
కాళింగుని పడగల పైన కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్ర నీలము
పాల జల నిధి లోన పాయని దివ్య-మృతము
బాలుని వాలె తిరిగే పద్మనాభుడు ||ముద్దుగారి యశోదా||
In english: Muddugari yashodaa
muddugari yashodaa, mungita mutyamu veedu
diddaraani mahimalaa devaki sutudu ||muddugari yashodaa||
charanam: 1
anthalintha gollethala, arachethi maanikyamu
panthamade kamsuni paali vajraamu
kaanthula , moodu lokaala garuda pacha poosaa
chenthalaa malo nunna chinni krishnudu ||muddugari yashodaa||
charanam: 2
rathikeli rukminiki rangu movi pagadamu
idi govardhanapu gomedhikamu
Shatamai shankha chakraala sandula vaiduryamu
gathiyai mammula kaache kamalakshudu ||muddugari yashodaa||
charanam: 3
kaalinguni padagala paina kappina pushyaragamu
eleti sri venkatadri indra neelaamu
paala jala nidhi lona payani divya-mrutamu
baluni vale tirige padmanabhudu ||muddugari yashodaa||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి