26, జూన్ 2009, శుక్రవారం

వందనమిదె గైకొనవో

పల్లవి
వందనమిదె గైకొనవో, గణపతి మహారాజా
వేలుపులకు వేలుపువు, నీకే తోలి పూజ - వందనమిదె 
చరణం : ౧
హిమగిరులే ఇల్లు కనుక మనసు చల్లనా,
కరిమోమును బడిసినావు భయము తీర్చగా -2-
ఇక్కట్లను తొలిగించే ఆది దైవమా
మా కన్నీళ్లను తుడవకుంటె  నీకు న్యాయమా.. - వందనమిదె -
చరణం : ౨
వేదనలను ఒర్చుకొదు మాదు మానసం,
వేగిరమే రావాలని ఎలుక వాహనం -2 -
భక్త జనుల పాలించే నెచ్చెలి
అనుదినము కొలిచేము నీకు  మ్రోక్కేదా - వందనమిదె -

Bhajan: Vandanamide gaikonavo (IN ENGLISH)
Pallavi
Vandanamide gaikonavo, ganapathi maharaaja
Veylupulaku veylupuvu neeke thotipooja - Vandanamide -
Charanam: 1
himagirule illu kanuka manasu challanaa,
Karimomunu badisinaavu bhayamu teerchaga -2-
Ikkatlanu tholiginche aadi daivamaa
Maa kanneellanu thudavakunte neeku nyayamaa.. - Vandanamide -
Charanam: 2
Vedanalanu orchukodu maadu maanasam,
Vegirame raavali eluka vaahanam -2 -
Bhaktha janula paalinche necheli
Anudinamu kolichemu neeku mrokkedaa - Vandanamide -

25, జూన్ 2009, గురువారం

సిద్ధి వినాయక నమామితే

పల్లవి
సిద్ధి వినాయక నామామితే
శ్రీ గణరాయ, జయ జయ దేవ హరే


చరణం : ౧
పాశకుఠార పరాంకుశ పాణి, పన్నగ భూషణ శాలినే - శ్రీ గణరాయ -
చరణం : ౨
మూషక యాన నిశాకర మౌళి, మోదక హస్త భాజామహే - శ్రీ గణరాయ -
చరణం : ౩
భాసిత శ్రీ లంబోదర గాత్రి, భక్త జనాబ్ది దయానిధే - శ్రీ గణరాయ -
చరణం : ౪
లోహిత లోచన దౌత శరీర, పాహి సురాగ్ర శిఖామణే - శ్రీ గణరాయ -
చరణం : ౫
విద్యాధారా గురోద్గురు మూర్తే, విఘ్నవిదూర సమారధే - శ్రీ గణరాయ -
చరణం : ౬
మత్త గజేంద్ర ముఖామ్బుజ శౌరీ, మంత్ర పురీశ్వర శూలనే - శ్రీ గణరాయ -

Bhajan: Sidhi vinaayaka namaamithe(Iన ENGLISH)
Pallavi
Sidhi vinaayaka namaamithe,
Sri ganaraaya, jaya jaya deva hare

Charanam: ౧
Pasha kutara parankusha paani,
Pannaga bhushana shaaline - Sri ganaraaya -
Charanam: 2
Mooshaka yaana nishaakara mouli
Modaka hastha bhajaamahe - Sri ganaraaya -
Charanam: 3
Bhaasitha sree lambodara gaatri
Bhaktha janaabdhi dayaanidhe - Sri ganaraaya -
Charanam: 4
Lohitha lochana doutha shareera
Paahi suraagra shikhaamane - Sri ganaraaya -
Charanam: 5
Vidhya dhaara gurodguru moorthe
Vigna vidhoora samaaradhe - Sri ganaraaya -
Charanam: 6
Matha gajendra mukhambuja shouree
Mantra pureeshwara shoolane - Sri ganaraaya -

జయ గణేశ జయ గణేశ

పల్లవి
జయ గణేశ, జయ గణేశ, జయ గణేశ దేవా
పార్వతి మనోహరా, సుతా వేగ రారా

చరణం : ౧
విగ్నములను బాపు దేవ , వినాయక రారా
అజ్ఞానము బాపి మమ్ము, కాపాడగా రారా
పార్వతి మనోహర, సుతా వేగ రారా - జయ గణేశ -

చరణం : ౨
పూజలందు ప్రథమ పూజ నీకు చేతుము రారా
వినాయక రారా
సంకటములు బాపి మమ్ము కరుణించగా రారా
పార్వతి మనోహర సుతా వేగ రారా - జయ గణేశ -

Bhajan: Jaya Ganesha, Jaya Ganesha
Jaya Ganesha, jaya Ganesha, jaya Ganesha devaa
Parvathi manoharaa, sutaa vega raara

Charanam: 1vignamu lanu baapu deva, vinayaka raara
Agnaanamu baapi mammu, kaapadaga raara
Parvathi manohara, sutaa vega raara
- Jaya Ganesha -

Charanam: 2
Poojalandu prathama pooja neeku chetumu raara
Vinayaka raara
Sankatamulu baapi mammu karuninchaga raara
Parvathi manohara sutaa vega raara
- Jaya Ganesha -

సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం

సరస్వతి త్వియం దృష్ట్యా, వీణ పుస్తక ధారిణి
హంసవాహ్ సమాయుక్త , విద్యాదాన కరీమమ

ప్రథమం భారతీ నామ, ద్వితీయం చ సరస్వతి ,
తృతీయం శారదదేవి, చతుర్థం హంసవాహన

పంచమం జగతిఖ్యాతం , షష్ఠం వాగీశ్వరి తథ ,
కౌమారి సప్తమం ప్రోక్తా, అష్టమం బ్రహ్మచారిని

నవమం బుద్ధి ధాత్రి చ, దశమం వరదాయిని,
ఏకాదశం క్షుద్ర ఘంట , ద్వాదశం భువనేశ్వరి

బ్రాహ్మి ద్వాదశ నామని, త్రిసంధ్యా యః పఠెన్ నరహ ,
సర్వసిద్ది కరీతస్య , ప్రసన్నా పరమేశ్వరి

సామే వసతు జిహ్వాగ్రే, బ్రహ్మరూప సరస్వతి

Saraswathi Dwadasha Naama Stotram (IN ENGLISH)

Saraswathi Thwiyam drushtya, VeeNa pushtaka dhaarini
Hamsa vaaha samaa yuktha, vidya daana karee mama

Prathamam bhaarathi naama, Dwiteeyam cha sarawathi,
Thruteeyam Shaarada devi, Chaturtham Hamsa Vaahana

Panchamam Jagathi khyatam, Shashtam Vaageeshwari tatha,
Kaumaari Sapthamam proktha, Ashtamam Brahmacharini

Navamam Buddhi dhaathri cha, Dashamam Varadaayini,
Ekadasham Kshudhra ghanta, Dwadasham Bhuvaneshwari

Brahmi dwadasha naamani, Thri sandhya yaha pathen naraha,
Sarva sidhi karee tasya, Prasanna parameshwari
Saame vasatu jihwagre, brahma roopa saraswathi

గణేశ స్తోత్రం

శుక్లాం భరదరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ద్యాయేత్ , సర్వ విగ్నోప శాంతయే .

అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం ,
అనేక దంతం భక్తానాం, ఏకదంతం ఉపాస్మహే


Shuklam Bharadaram vishnum, Shashivarnam chaturbhujam
prasanna vadanam dhyayeth, sarva vignopa shaantaye.

Agajaa aanana padmarkam, gajaanana maharnisham,
aneka dantam bhaktaanaam, eka dantham upasmahe.

క్షీరాబ్ది కన్యకకూ

పల్లవి
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి,
నీరజా లయమునకు , నీరాజనం …. నీరాజనం [2]

చరణం: ౧
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కర్ప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం

చరణం : ౨
చరణ కిసలయములకు సకియ రంభోరులకు
నిరతమగు ముత్యాల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజ నాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

చరణం : ౩
పగటు శ్రీ వెంకటేశు పట్టపు రానియై
నెగడు సతి కలలకును నీరాజనం
జగతి అలమేలు మంగ చక్కదనములకెల్లనిగాడు
నిజశోభనపు నీరాజనం !!


క్షీరాబ్ది కన్యకకు నీరాజనం !! శ్రీ మహా లక్ష్మికిని నీరాజనం !!
నీరజాలయమునకు నీరాజనం !!

IN ENGLISH - Ksheerabdi kanyakaku
Saaki
Ksheerabdi kanyakaku sree mahalakshmiki,
Neeraja layamunaku, neerajanam …. neeraajanam 2

Charanam: 1
Jalajakshi momunaku Jakkava kuchambulaku Nelakonna kappurapu Neerajanam Aliveni thurumunaku hastha kamalambulaku Niluvu manikyamula Neerajanam

Charanam: 2
Charana kisalayamulaku sakiya rambhorulaku Niratamagu mutthela Neeraajanam Aridi jaghanambunaku athiva nija naabhikini Nirati naanaavarna Neeraajanam

Charanam: 3
Pagatu Sri Venkateshu Pattapu raaniyai Negadu Sati kalalakunu Neerajanam Jagati~n~Alamelu Manga Chakkadanamulakella Nigadu Nija Sobhanapu Neeraajanam !!

Ksheerabdi kanyakaku Neerajanam !!
Sri Maha Lakshmikini Neerajanam !!Neerajaalayamunaku Neeraajanam !!

మంగళ హారతులు మా రాములకు

పల్లవి
మంగళ హారతులు మా రాములకు,
మాతా సీత , సౌమిత్రి హనుమలకు [2]

చరణం : ౧
ధరణి తనయకు, దశరథ సుతునకు (2)
మంగళకర సౌమిత్రి హనుమలకు (2)
మంగళ ...
చరణం : ౨
తాటకి వధియించి తపసి యాగము గాచి, (2)
హరువిల్లు విరిచిన కళ్యాణ రాములకు (2)
మంగళ ...
చరణం : ౩
వనములకేగి , వానరులను కాచిన (2)
నరులను ఏలిన నారయనునకు (2)
మంగళ ...

మంగళ హారతులు మా రాములకు,
మాతా సీత , సౌమిత్రి హనుమలకు
మంగళ హారతులు మా రాములకు.


IN ENGLISH - Mangala harathulu maa raamulaku
Pallavi
Mangala harathulu maa ramulaku,
Maata seetha, sowmithri hanumalaku --2--
Charanam: 1
Dharani sutunaku, Dasharatha tanayaku (2)
Mangalakara sowmitri hanumalaku (2) --Mangala...--
Charanam: 2
Taataki vadhiyinchi tapasi yagamu gaachi
Haruvillu virachina kalyana raamlaku (2) --Mangala...--
Charanam: 3
Vanamula kegi, vaanarulanu kaachina (2)
Narulanu elina naarayanunaku (2) --Mangala...--
Mangala harathulu maa ramulaku,
Maata seetha, sowmithri hanumalaku

మన తెలుగు

మన తెలుగులో ఉన్నా పాత పాటలు, మన సంస్కృతిని తెలిపే మరిన్ని విశేషాలను పొందు పరచడానికే ఈ బ్లాగ్ ని సృష్టించాను. దీనికి అందరి సహకారం కూడా లభిస్తుందని ఆశిస్తున్నాను
ఇంక మొదలు పెడదామా !!

మాది కరీంనగర్ జిల్లలో ఉన్నా మంథని అను చిన్న గ్రామం. మా ఊరి లో ఉన్నా మహాలక్ష్మి అమ్మవారి ఆలయం లో పాడుకునే భజనలు, పాటలు ఈ బ్లాగ్ లో పొందు పరచడమైనవి. అవే కాకుండా భగవంతుని తలచుకునే కూడా ఇందులో కలపటం జరిగినవి.
ఈ బ్లాగులో ఏమైనా పొరపాట్లు ఉంటె క్షమించి, సరిదిద్దవలసినదిగా మనవి. మీ సహాయ సహకారములకు ముందుగానే ధన్యవాదములు.

LinkWithin

Related Posts with Thumbnails