25, మే 2017, గురువారం

నారాయణతే నమో నమో/Narayanathe Namo Namo


అన్నమాచార్య కీర్తన
ఆది తాళం

పల్లవి 
నారాయణతే నమో నమో .... (2)
భవ నారద సన్నుత నమో నమో ... (2)
                                                                   || నారాయణతే ||

చరణం: 1
మురహర భవహర ముకుంద మాధవ .. (2)
గరుడ గమన పంకజనాభా .. || మురహర||
పరమ పురుష భవబంధ విమోచన
నరమృగ శరీర నమో నమో
నమో నరమృగ శరీర నమో నమో
                                                                 || నారాయణతే ||

చరణం:2
జలధి శయన రవిచంద్ర విలోచన  .... (2)
జలరుహ భవానుత చరణాయుగ || జలధి ||
భలి బంధన గోపవధూ వల్లభ
నలినోదారతే నమో నమో
నమో నలినోదారతే నమో నమో
                                                              || నారాయణతే ||
చరణం: 3
ఆది దేవా సకలగమ పూజిత ... (2)
యాదవ కుల మోహన రూప || ఆది ||
వేదోధార శ్రీ వెంకటనాయక
నాద ప్రియతే నమో నమో
నమో నాద ప్రియతే నమో నమో
                                                           || నారాయణతే ||
In ENGLISH
Annamaacharya Keerthana
Aadi taalam

Pallavi: 
Narayanathe namo namo .. (2) 
Bhava Naarada sannutha namo namo  .. (2)          || Narayanathe ||

Charanam1: 
Murahara bhavahara mukunda madhava
Garuda gamana pankajanabha
Parama purusha bhavabandha vimochana
Naramruga sharIra namo namo ..
 
Namo Naramruga sharIra namo namo ..               || Narayanathe ||

Charanam2: <
Jaladhi shayana ravichandra vilocana
Jalaruha bhavanutha charanayuga
Bhali bandhana gopavadhu vallabha
Nalinodharathe namo namo ..

Namo Nalinodharathe namo namo                        || Narayanathe ||


Charanam3:
Adi deva sakalagama pujitha
Yadava kula mohanarupa
Vedodhara Sri venkatanayaka
Nada priyathe namo namo

Namo, Nada priyathe namo namo                        || Narayanathe ||

19, మే 2017, శుక్రవారం

భ్రమరాంబిక అష్టకం /Bramarambika ashtakam



రవి సుధాకర వహ్ని లోచన రత్నకుండల భూషిణి 
ప్రవిమలంబుగా మమ్మునేలిన భక్తజన చింతామణి 
>అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి  >
శివుని పట్టపురాణి గుణమణి శ్రీ గిరి భ్రమరాంబికా || 

కలియుగంబున మానవులను కల్పతరువై యుండవా 
వెలయు శ్రీ గిరి శిఖరమందున విభవమై విలసిల్లవా 
ఆలసింపక భక్త వరులకు అష్ట సంపద లీయావా 
జిలుగు కుంకుమ కాంతిరేకుల  శ్రీ గిరి  భ్రమరాంబిక || 

అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్
పొంగుచును వరహాల కొంకణ భూములయందునన్ 
రంగుగా కర్ణాట మగధ మరాఠ దేశములందునన్ 
శృంఖలా దేశముల వెలసిన శ్రీ గిరి భ్రమరాంబిక || 

అక్షయంబుగా కాశి లోపల అన్నపూర్ణ భవానివై 
సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి 
మోక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణశక్తివి 
శిక్షజేతువు ఘోర భవముల శ్రీ గిరి భ్రమరాంబిక ||  
 
ఉగ్ర లోచన వర వధూమణి యొప్పుగల్గిన భామిని
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనాకారిణి 
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణి 
శీఘ్రమేకని వరము లిత్తువు శ్రీ గిరి భ్రమరాంబికా ||

నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ
మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ
చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా ||

సోమశేఖర పల్లవారధి  సుందరీమణీ ధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ
నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా || 
 
భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివి 
ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివి 
పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివా
శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమారాంబికా || 
 
ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున
పల్లవించును నీప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా || 

తరుణి శ్రీ గిరి మల్లికార్జున దైవరాయల భామినీ  
కరుణతో మమ్మేలు యెప్పుడు కల్పవృక్షము భంగినీ  
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి  
సిరులనిచ్చెద వేల్ల కాలము శ్రీ గిరి భ్రమరాంబిక || 

IN ENGLISH
Ravi sudhaakara vahni lochana ratna kundala bhooshiNi
pravimalambuga mammunelina bhaktha jana chintamaNi
avani janulaku kongu bangaaraina daiva shikhaamaNi
shivuni pattapuraNi guNamaNi Sri giri Bhramaraambika || 
 
kaliyugambuna maanavulakunu kalpataruvai yundagaa
velayu srigiri shikharamanduna vibhavamai vilasillava
aalasimpaka bhaktha varulaku ashta sampada leeyava
jilugu kumkuma kanthi rekula sri giri  Bhramaraambika || 
 
anga vanga kalinga kaashmirandhra deshamulandunan
ponguchunu varahala konkana bhoomula yandunan
ranguga karnata magadha maraata deshamulandunan
shrunkhalaa deshamuna velasina sri giri Bhramaraambika || 
 
akshayambuga kaashi lopala annapoorna bhavaanivai
sakshi ganapathi kanna tallivi sadguNaavathi shaambhavi
moksamosagedu kanakadurgavu moolakaaraNa shakthivi
shiksha jetuvu ghora bhavamula sri giri Bhramaraambika || 
 
ugralochana vara vadhoomaNi toppugalgina bhaamini
vigrahambula kella ghanamai velayu shobhanaa kaariNi 
agrapeetamunandu velasina aagamaartha vichaariNi
Sheegramanekani varamu lithuvu sri giri Bhramaraambika ||

Nigama gochara neela kundali nirmalangi niranjani
migula chakkani pushpa komali meena netra dayaanidhi
jagathilona prasidhi kekkina chandramukhi seemanthini
chigurutaakula vanti pedavula sri giri Bhramaraambika ||

Somashekhara palla vaaridhi sundarimaNi dheemaNi
komalangi krupaa payonidhi kutila kuntala yogini
naa manambuna paayakundama nagakuleshuni nandini
seemalona prasiddi kekkina sri giri Bhramaraambika ||

Bhootha naathuni vaama bhaagamu ponduga chekontivi
khyathiganu sri sailamuna vikhyathiga nelakontivi
paatakambula paaradroluchu bhakthulanu chekontivaa
shwethagiripai nundi velasina sri giri Bhramaraambika ||

ella velasina needu bhaavamu vishnu lokamu nanduna
pallavunchunu nee prabhaavamu brahma lokamu nanduna
tellamuga kailaasa mandunamoodu lokamu landuna
chellunamma triloka vaasini sri giri Bhramaraambika ||

Taruni Sri giri mallikaarjuna daiva raayala bhaamini
karuNatho mammelu yeppudu kalpa vrukshamu bhamgini
varusatho nee yashtakambunu vrasi chadivina vaariki
sirulaniccheda vella kaalamu sri giri Bhramaraambika||

LinkWithin

Related Posts with Thumbnails