పల్లవి
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ |
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ |
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ || 3||
చరణం: 1
నీరిలోన తల్లడించే నీకే తలవంచీ !
నీరికింద పులకించీ నీరమణుండు!! || 2||
గోరికొన చెమరించీ కోపమే పచరించీ ||2||
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ
|| అమ్మమ్మ ఏమమ్మ||
చరణం: 2
నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ |
మేకొని నీ విరహాన మేను వెంచీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ |
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా
|| అమ్మమ్మ ఏమమ్మ||
చరణం: 3
చక్కదనములె పెంచీ సకలము గాలదంచి |
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ |
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ
|| అమ్మమ్మ ఏమమ్మ||
In English -
Ammamma emamma alamelmanga nancharamma
tamiyinta nalarukomma ...Oyamma || 3||
Charanam: 1
nirilona talladinchi neeke talavanchi
niri kinda pulakinchi nee ramaNundu ||2||
gorikona chemarinchi kopame pacharinchi ||2||
sareku nee aluka itte chalinchavamma || ammamma ||
Charanam: 2
neeku gaane cheyyi chachi nindaa kopamu rechi
mekoni nee virahanaa meynu venchini
eekadaakadi satula hrudayame perarechi
aaku madachi iyyanaina aanateeyavamma || ammamma||
Charanam: 3
chakkadanamule penchi sakalamu gaaladanchi
chakkadanamule penchi sakalamu gaaladanchi
nikkapu venkateshudu neeke ponchini
makkuvatho alamelmanga nancharamma
akkuna naatani nitte alarinchamma || ammamma ||