28, జులై 2009, మంగళవారం

చుక్కల అమావాస్య




శ్రావణ మాసం అమావాస్య రోజు నుండి మొదలు అగును. ఆ అమావస్యనే చుక్కల అమావాస్య అని కూడా అందురు. కొంతమంది స్త్రీలకు చుక్కల అమావాస్య నోమును నోచుకుంటారు.
ఈ వ్రతం ఐదు ఏళ్ళు చేసుకుంటారు. దీనికి దీపస్తంభ వ్రతము అని కూడా పేరు ఉంది.
ఈ వ్రతం ఎలా చేసుకుంటారో త్వరలో చెపుతాను. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తాను.

short break ...

వ్రతాలు

దక్షిణాయనం మొదలు అయింది అనగా పండుగలు వొస్తున్నాయి అని అర్థం. దక్షిణాయనం లో మొదలు వోచేది శ్రావణ మాసం. ఈ మాసంలో చాలా మంది పెళ్లి అయిన ఆడువారు వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకొని పసుపు కుంకుమలు ఎల్ల కాలము నిలుపుమని కోరెదరు.
ఇక నుండి ఈ బ్లాగు లో హారతిపాటలు, భజనలు, స్తోత్రములతో పాటు మన ఆచార వ్యవహారాలను తెలిపే వ్రతాలు, వాటిని పాటించే పద్దతి కూడా వ్రాయాలని అనుకుంటున్నాను. దీనికి కూడా మీ అందరి సహకారం లభిస్తుంది అని ఆశిస్తున్నాను.

22, జులై 2009, బుధవారం

సౌభాగ్యలక్ష్మీ రావమ్మ

 పల్లవి
సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మ -- ౨--

చరణం: ౧
నుదిటి కుంకుమ రవి బింబముగా, కన్నుల విందుగ కాటుక వెలుగ,
కాంచన హారము గళమున మెరియగ, పీతాంబరముల శోభలు నిండుగా -- సౌభాగ్య --

చరణం: ౨
నిండుగ కరముల బంగరు గాజులు, ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు
గల గలమని సవ్వడి చేయగ, సౌభాగ్యవతుల సేవలనందగ  -- సౌభాగ్య --

చరణం: ౩
నిత్య సుమంగళి నిత్య కళ్యాణి, భక్త జనుల మా కల్పవల్లివై,
కమలాసనవై కరుణ నిండగా, కనక వృష్టి కురిపించే తల్లి -- సౌభాగ్య --

చరణం: 4
జనక రాజుని ముద్దుల కొమరిత, రవికుల సోముని రమణీవై 
సాధు సజ్జనుల పూజలందుకొని శుభముల నిచ్చేడి దీవేనలీయగా -- సౌభాగ్య --

చరణం : 5
కుంకుమ శోభిత పంకజ లోచని వెంకట రమణుని పట్టపురాణి 
పుష్కలముగా సౌభాగ్యములు ఇచ్చే, పుణ్య మూర్తి మా ఇంట వెలసిన -- సౌభాగ్య ..—

చరణం : 6
సౌభాగ్యమ్ముల బంగరు తల్లి, పురంధర విట్టలుని పట్టపు రాణి,
శుక్ర వారము పూజలనందగా, సాయం సంధ్యా శుభ ఘడియలలో -- సౌభాగ్య ..—

Sowbhagya lakshmi ravamma, amma (IN ENGLISH)

Sowbhagya lakshmi ravamma, amma -- 2--

Charanam: 1
nuditi kumkuma ravi bimbamuga, Kannula vinduga katuka velaya,
Kaanchana haaramu galamuna meriyaga, Peetambaramula shobhalu nindaga -- Sowbhagya ..—

Charanam: 2
Ninduga karamula bangaru gaajulu, Mudduloluku paadammula muvvalu
Gala gala galamani savvadi cheyaga, sowbhagyavatula sevalanandaga -- Sowbhagya --

Charanam: 3
Nitya sumangali nitya kalyani, Bhaktha janula maa kalpavalli vayi,
Kamala asanavayi karuna nindaga, Kanaka vrushti kuripinche talli -- Sowbhagya --

Charanam: 4
Janaka raajuni muddula komaritha, ravikula somuni ranaNi vayi,
saadhu sajjanula poojal andukoni, shubhamula nichedi deevenaleeyaga -- Sowbhagya --

Charanam: 5
kumkuma shobhitha pankaja lochani, Venkata ramanuni pattapu raani,
Pushakalmuga sowbhagyamulu iche, Punya moorthi maa inta velasina -- Sowbhagya ..—

Charanam : 6
Sowbhahyammula bangaru talli, Purandhara vitaluni pattapu raani,
Shukra vaaramu poojalanu andaga, Saayam sandhya shubha ghadiyalalo -- Sowbhagya --


Sowbhagya lakshmi ravamma, amma -- 2--
----------------------------------------------------------------------------------
This song can be heard at the following link:
http://www.musicindiaonline.com/music/devotional/s/album.6670/language.4/
it is sixth song in the album.
-----------------------------------------------------------------------------------

14, జులై 2009, మంగళవారం

రాధే రాధే రాధే , రాధే గోవిందా

రాధే రాధే రాధే , రాధే గోవిందా, బృందావన చందా ,
అనాధనాథా దీనా బంధో రాధే గోవిందా -2-
చరణం: 1
నందకుమర నవనీత చొర రాధే గోవిందా , బృందావన చందా - 2-
అనాధనాథా దీనా బంధో రాధే గోవిందా
చరణం : 2
వేణు విలోల విజయ గోపాల రాధే గోవిందా, బృందావన చందా -2-
అనాధనాథా దీనా బందో రాధే గోవిందా
చరణం : ౩
పండరినాథ పాండురంగ , రాధే గోవిందా, బృందావన చందా - 2-
అనాధనాథా దీనా బంధో రాధే గోవిందా
చరణం: 4
పుండరికాక్ష పురాణ పురుష రాధే గోవిందా, బృందావన చందా -2-
అనాధనాథా దీనా బందో రాధే గోవిందా
చరణం: 5
నందకుమర నవనీత చొర రాధే గోవిందా , బృందావన చందా - 2-
అనాధనాథా దీనా బంధో రాధే గోవిందా

చరణం: 6
వెంకట రమణ సంకట హరణ రాధే గోవిందా,బృందావన చందా - 2-
అనాధనాథా దీనా బంధో రాధే గోవిందా

Radhe radhe raadhe, raadhe govinda (In ENGLISH)

Pallavi
Radhe radhe raadhe, raadhe govinda
Brundavana chanda
Anaadha naadha deena bandho raadhe govinda -2-

Charanam: 1
Nanda kumaara navanitha chora radhe govinda , Brundavana chanda
Anaadha naadha deena bandho raadhe govinda

Charanam: 2
Venu vilola vijaya gopala radhe govinda, Brundavana chanda
Anaadha naadha deena bandho raadhe govinda

Charanam: 3
Pandarinaatha panduranga, radhe govinda, Brundavana chanda
Anaadha naadha deena bandho raadhe govinda

Charanam: 4
Pundarikaksha puraana purusha radhe govinda, Brundavana chanda
Anaadha naadha deena bandho raadhe govinda

Charanam: 5
venkata ramana sankata harana radhe govinda , Brundavana chanda
Anaadha naadha deena bandho raadhe govinda

13, జులై 2009, సోమవారం

ముజ్జగమ్ముల గన్న మా అమ్మ

పల్లవి
ముజ్జగమ్ముల గన్న మా అమ్మ,
దేవాది దేవి మంగలమ్ములు కొనగా రావమ్మ
ముంముర్తుల శక్తి నీవే, ముగ్గురమ్మల మూలం నీవే
ముదితలకు మాంగల్య రక్షణ చేసి మురిసేది దాన నీవే     -- ముజ్జగమ్ముల --

చరణం: 1
మందహాస దయా విలసితాక్షి, ఆనంద మందిర
మంగళకర మధుర మీనాక్షి
చందురుని మించిన ముగంబున చుక్క నొక్కిన ముక్కు వజ్రము
అందెల అడుగుల అనగి బ్రోవ ఆత్మజుల మమ్మేలు రావా     -- ముజ్జగమ్ముల--

చరణం : 2
వారణాసి విశాలక్షివే, శ్రీ విశ్వనాధుని
వామ భాగము నందు వేలుగుదువే
ఘోర కల్మష హరిణి కాంచి విహారిణి కామాక్షి
భారకర సంసార భాగోత్తరిని పద్మాక్షి దేవి       -- ముజ్జగమ్ముల--

చరణం : ౩
నిఖిల నిగమ నిధాన గాయత్రి, లోకైక నేత్రి
సుఖ సమున్నత శాంతి సంధాత్రి,
ముకర చంద్రో వర్ణ గాత్రి , ముక్త హార త్రినేత్రి
ప్రహర శుద్ధ  వినాష సూత్రి , బాల రఘురామాభి నేత్రి
ముజ్జగమ్ముల గన్న మా అమ్మ,
దేవాది దేవి మంగలమ్ములు కొనగా రావమ్మ

Mujjagammula Ganna maa amma ( In English)

Pallavi
Mujjagammula ganna maa amma,
Devadi devi mangalammulu konaga ravamma
Mummurthula shakthi neeve, muggurammala moolam neeve
Muditalaku mangalya rakshana chesi murisedi daana neeve      --Mujjagammula --

Charanam: 1
Mandahasa daya vilasitakshi, ananda mandira
Mangalakara madhura meenakshi
chanduruni minchina mogambuna chukka nokkina mukku vajramu
andela adugula ghallu mrova aatmajula mammela raava            - Mujjagammula --

Charanam: 2
Varanasi vishalakshive, sree vishva nadhuni
vaama bhagamu nandu velasedave
ghora kalmasha harini kanchi viharini kamakshi
bhaara kara samsaara bhagottarini padmakshi devi                   - Mujjagammula --

Charanam: 3
Nikhila nigama nidhaana gaayatri, lokaika netri
sukha samunnatha santhi sandhatri
mukara chandro varNa gaathri, muktha haara trinethri
prahara shudhha vinaSha suthri baala raghuramabhi nethri      - Mujjagammula --

2, జులై 2009, గురువారం

సర్వ మంగళ నామా సీతా రామా ... రామా

పల్లవి
సర్వ మంగళ నామా సీతా రామా ... రామా ,
సర్వ వినుత శాంతి దాతా రామా రామా

చరణం : ౧

నీవునేనని భేద బుధి మాపి మాలో,
నిలువుమా విజ్ఞాన శక్తి రామా ... రామా - సర్వ మంగళ -

చరణం : ౨
మనసులో మాయాబాపీ రామా,
మునుపుమని మోయు చూపు రామా ... రామా - సర్వ మంగళ -

చరణం :౩

కామ క్రోధ లోభ మోహ పాశంబుల
కడకు ద్రోపి పాపుమయ్య రామా ... రామా - సర్వ మంగళ -

Bhajans: Sarva mangala naama seetha raamaa raamaa (In ENGLISH)

Pallavi
Sarva mangala naama seetha raamaa raamaa,
Sarva vinuta shanthi daatha raamaa raamaa

Charanam: 1neevi nenani bhedha budhi maapi maalo,
Niluvumaa vignana shakthi raamaa raamaa Sarva mangala

Charanam: 2
Manasulo maayabaapI raamaa,
Munupumani moyu chupu raamaa raamaa Sarva mangala

Charanam: 3kaama krodha lobha moha paashambula
Kadaku dropi paapumayya raamaa raamaa Sarva mangala

శ్రీ సత్యనారాయనుని సేవకు రారండి

పల్లవి

శ్రీ సత్యనారాయనుని సేవకు రారండి
మనసార స్వామిని కొలిచి, హారతులు ఇవ్వండి
నోచిన వారికి నోచిన ఫలము, చూచిన వారికి చూచిన ఫలము - శ్రీ సత్యనారాయనుని -

చరణం : ౧

స్వామిని పూజించే చేతులే చేతులట ,
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట,
తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట - శ్రీ సత్యనారాయనుని -

చరణం : ౨

ఎ వేళనైన కొలిచే dఐవం ఈ దైవం
అన్నవరం లో వెలసిన దయివం ప్రతి ఇంటికి దయివం,
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా
పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని వేదేమా - శ్రీ సత్యనారాయనుని -

చరణం :

మంగళం అనరమ్మ జయ మంగళం అనరమ్మ
కరములు జోడించి శ్రీ చందనం అలరించి
మంగళ కరమగు శ్రీ సుందరముర్తికి వందనం అనరమ్మ - శ్రీ సత్యనారాయనుని -

Sri Satyanarayanuni sevaku (IN ENGLISH)

Pallavi
Sri Satyanarayanuni sevaku rarandi,
Manasaara swamini kolichi, harathulu ivvandi
Nochina variki nochina phalamu, chuchina variki chuchina phalamu
Sri Satyanarayanuni

Charanam: 1Swamini poojinche chetule chetulata,
Aa moorthini darshinche kanule kannulata,
Tana katha vinte evvarikaina janma tarinchunata
Sri Satyanarayanuni

Charanam: 2
Ey velanaina koliche dayivam ee dayivam.
Annavaram lo velasina dayivam prati intiki dayivam,
Archana cheddama manasu arpana cheddama
Swamiki madilone kovela kadadama
Padi kaalalu pasupu kumkumalu immani vedema
Sri Satyanarayanuni

Charanam: 3mangalam anaramma jaya mangalam anaramma
Karamulu jodinchi sri chandanam alarinchi
Mangala karamagu sri sundaramurthuki vandanam anaramma
Sri Satyanarayanuni

----------------------------------------------------------------------------------

This song can be heard/seen at the following link:

http://videos.ibibo.com/videos/viewvideo/Appadam/54531

-----------------------------------------------------------------------------------

LinkWithin

Related Posts with Thumbnails