13, జులై 2009, సోమవారం

ముజ్జగమ్ముల గన్న మా అమ్మ

పల్లవి
ముజ్జగమ్ముల గన్న మా అమ్మ,
దేవాది దేవి మంగలమ్ములు కొనగా రావమ్మ
ముంముర్తుల శక్తి నీవే, ముగ్గురమ్మల మూలం నీవే
ముదితలకు మాంగల్య రక్షణ చేసి మురిసేది దాన నీవే     -- ముజ్జగమ్ముల --

చరణం: 1
మందహాస దయా విలసితాక్షి, ఆనంద మందిర
మంగళకర మధుర మీనాక్షి
చందురుని మించిన ముగంబున చుక్క నొక్కిన ముక్కు వజ్రము
అందెల అడుగుల అనగి బ్రోవ ఆత్మజుల మమ్మేలు రావా     -- ముజ్జగమ్ముల--

చరణం : 2
వారణాసి విశాలక్షివే, శ్రీ విశ్వనాధుని
వామ భాగము నందు వేలుగుదువే
ఘోర కల్మష హరిణి కాంచి విహారిణి కామాక్షి
భారకర సంసార భాగోత్తరిని పద్మాక్షి దేవి       -- ముజ్జగమ్ముల--

చరణం : ౩
నిఖిల నిగమ నిధాన గాయత్రి, లోకైక నేత్రి
సుఖ సమున్నత శాంతి సంధాత్రి,
ముకర చంద్రో వర్ణ గాత్రి , ముక్త హార త్రినేత్రి
ప్రహర శుద్ధ  వినాష సూత్రి , బాల రఘురామాభి నేత్రి
ముజ్జగమ్ముల గన్న మా అమ్మ,
దేవాది దేవి మంగలమ్ములు కొనగా రావమ్మ

Mujjagammula Ganna maa amma ( In English)

Pallavi
Mujjagammula ganna maa amma,
Devadi devi mangalammulu konaga ravamma
Mummurthula shakthi neeve, muggurammala moolam neeve
Muditalaku mangalya rakshana chesi murisedi daana neeve      --Mujjagammula --

Charanam: 1
Mandahasa daya vilasitakshi, ananda mandira
Mangalakara madhura meenakshi
chanduruni minchina mogambuna chukka nokkina mukku vajramu
andela adugula ghallu mrova aatmajula mammela raava            - Mujjagammula --

Charanam: 2
Varanasi vishalakshive, sree vishva nadhuni
vaama bhagamu nandu velasedave
ghora kalmasha harini kanchi viharini kamakshi
bhaara kara samsaara bhagottarini padmakshi devi                   - Mujjagammula --

Charanam: 3
Nikhila nigama nidhaana gaayatri, lokaika netri
sukha samunnatha santhi sandhatri
mukara chandro varNa gaathri, muktha haara trinethri
prahara shudhha vinaSha suthri baala raghuramabhi nethri      - Mujjagammula --

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails