23, నవంబర్ 2009, సోమవారం

శ్రీ ఆంజనేయ దండకం - Sri Anjaneya Dandakam

శ్రీ ఆంజనేయం ప్రసన్నాజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్
ప్రభాతంబు సాయంత్రంబు నీ నామ సంకీర్తనల్ చేసి
నీ రూపు వర్ణించి నీ మీద నే దండకంబోక్కటింజేయ నూహించి
నీ మూర్తినిన్ గాంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై
నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్ష్శంబునన్ జూచితే
వేడుకన్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంత వాడన్
దయాశాలివాయి జూచితే దాతవాయి బ్రోచితే దగ్గరన్ నిల్చితే
తొల్లి సుగ్రీవునకున్ మంత్రివాయి స్వామి కార్యంబునందుండి
శ్రీ రామ సౌమిత్రులన్జుచి వారిన్ విచారించి
సర్వేషు పూజించి, యద్భానుజున్ బంటుగావించి యవ్వలినిన్జన్పి
కాకుస్తితిలకున్ దయాదృష్టి వీక్షించి
కిష్కింద కే తెంచి శ్రీ రామ కార్యార్ధివై
లంకకేతెంచియున్ లంకినిన్జంపియున్ లంకనున్గాల్చియున్
భూమిజంజూచి యానందముప్పొంగా నాయున్గారంబిచ్చి
యారత్నమున్దేచ్చి శ్రీ రాముకున్నిన్చ్చి సంతోశునిన్జేసి
సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలదులన్గుడి
యాసేతువున్ దాటి వానరున్ మూకలై పెన్మూకలై
దైత్యులన్ద్రున్చగా రావనున్దంతా కాలాగ్ని రూపోగ్రుడై
కోరి బ్రమ్హన్డమయినట్టి యా శక్తినన్ వేసి
యా లక్ష్మణున్ మూర్చనోన్దిన్చాగా నప్పుడే పోయి
సంజీవినిన్దేచి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుమ్భాకర్నాడులన్వీరులన్ బోరా శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావనున్జమ్పగానంత లోకంబులానందమై యుండ
నవ్వేలనన్ విభీషనున్ వేడుకన్ దొడుగాన్వచ్చి
పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి యున్దేచి శ్రీరాముకున్నిచ్చి
ఆయ్యోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై యున్న
నీకన్న నాకెవ్వరున్ గుర్మిలేరంచు మన్నించినన్
శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి
నీ సంకీర్తనల్జేసితే పాపముల్భాయునే
భయమునుల్దీరునే భాగ్యముల్గల్గునే సకల సామ్రాజ్యముల్
సకల సంపతులున్ గల్గునే వానరాకార యోభక్త
మందార యో పుణ్యసంచార యోధీర యోశూర నీవే
సమస్తంబుగా నొప్పి యాతారకబ్రహ్మ మంత్రంబు
పఠిన్చుచున్ స్తిరముగన్ వజ్రదేహంబునున్దాల్చి
శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై
ఎప్పుడున్ తప్పకన్ తలచు నాజిహ్వ యందుండి
నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారివై
రామ నామామ్కితద్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్
రౌద్రినీ జ్వాల కల్లోల హావీర హనుమంత
ఓంకార హ్రీంకార శబ్డంబులం
భూతప్రేత పిశాచంబులన్ శాకిని ఢాకినిత్యాదులన్ గాలిడైయంబులన్
నీదు వాలంబునంజుట్టి నేలంబడంగొట్టి
నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్
ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మ ప్రభా
భాసితంబైన నీదివ్య తెజంబునంజుచి రారోరి నా ముద్దునరసింహ యనుచున్ దయాదృష్టి వీక్షించి
నన్నేలు నా స్వామీ నమస్తే సదాబ్రహ్మచారి నమస్తే వాయుపుత్రా నమస్తే నమస్తే నమస్తే నమః

IN ENGLISH - Anjaneya dandakam

Sri anjaneyam prasanna anjaneyam
prabha divya kaayam prakeerthi pradaayam
bhaje vaayuputram bhaje vaala gaatram
bhaje ham pavitram bhaje soorya mitram
bhaje rudraroopam bhaje brahma tejam batamchun
prabhaatambu saayamtrambu nee naama sankeertanal chesi
nee roopu varninchi nee meeda ne dandakambokkatinjeya noohinchi
nee moorthinin gaanchi nee sundarambenchi
nee daasa daasundanayi raama bhaktundanayi
ninnu ne golchedan nee kataashambunan juchite
vedukan jesite naa moraalinchithe nannu rakshinchithe
anjanaadevi garbhaanvayaa deva ninnencha nenentha vaadan
dayaashaalivayi juchithe daatavayi brochithe, daggaran nilchithe
tolli sugreevunakun mantrivayi swamy kaaryambunandundi
sree raama sowmitrulanjuchi vaarin vichaarinchi
sarveshu poojinchi, yadbhaanujun bantugaavinchi yavvalininjanpi
kaakusthithilakun dayaadrusti veekshinchi
kishkindha ke tenchi sri raama kaaryardhivayi
lankaketenchiyun lankiNiNjampiyun lankanungaalchiyun
bhoomijamjoochi yaanandamupponga naayungarambichi
yaaratnamundechi sri raamukunnincchi santhoshuninjesi
sugreevunin angadun jaambavantaadi neeladulangudi
yaasetuvun daati vaanarun mookalai penmookalai
daityulandrunchagaa raavanundantha kaalaagni roopogrudai
kori bramhandamayinatti yaa shakthinan vesi
yaa lakshmanun moorchanondinchagaa nappude poyi
sanjeevinindechi sowmitrikinnicchi praaNambu rakshimpagaa
kumbhakarnaadulanveerulan bora sreeraama baanaagni
vaarandarin raavanunjampagaanantha lokambulaanandamai yunda
navvelanan vibheeshanun vedukan Doduganvacchi
pattabhishekambu cheyinchi seethamahadevi yundechi sreeraamukunnicchi
aayyodhyakun vacchi pattabhishekambu samrambhamai yunna
neekanna naakevvarun gurmileranchu manninchinan
sreeraama bhakthi prashasthambugaa ninnu sevinchi
nee sankeerthanaljesithe paapamulbhaayune
bhayamunuldeerune bhagyamulgalgune sakala saamrajyamul
sakala sampathulun galgune vaanaraakaara yobhaktha
mandaara yo punyasanchaara yodheera yoshoora neeve
samasthambugaa noppi yaataarakabramha mantrambu
pathinchuchun stiramugam vajradehambunundaalchi
sreeraama sreeraama yanchun manahpootamai
yeppudun tappakan talachu naajihva yandundi
nee deergha dehambu trailokya sancharivai
raama naamaamkithadyaanivai bramhavai bramhatejambunan
rowdriNee Jwaala kallola haaveera hanumantha
omkaara hreemkaara shabdambulam
bhoothapreta pishaachambulan
shaakini dhaakinityaadulan gaalidaiyambulan
needu vaalambunanjutti nelambadamgotti
neemushtighatambulan baahudandambulan romakhandambulan
dhrunchi kaalaagni rudrundavai neevu bramha prabhaa
bhaasitambaina needivya tejambunanjuchi raarori
naa muddunarasimha yanuchun dayaadrushti veekshinchi
nannelu naa swamee Namaste sadaabrahmachaari Namaste
vaayuputraa Namaste Namaste Namaste namah

1 కామెంట్‌:

LinkWithin

Related Posts with Thumbnails