11, జనవరి 2019, శుక్రవారం

లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా /Lalitha Sahara Parayana Manamantha Cheddamaa


శ్రీ లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా, 
మనసారా అమ్మను కొలిచి హారతులిద్దామా 

చరణం: 1
ఆహ్వానిద్దామా, ఆర్ఘ్య  పాద్యా లిద్దామా,
సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా    || లలితా ||

చరణం: 2
పూజలు చేద్దామా, పుష్ప మాలలు వేద్దామా ,
పాలు, పండ్లు, తేనే, చెక్కరతో అభిషేకిద్దామా  || లలితా ||

చరణం: 3
అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా,
తల్లికి మదిలోనే, కోవెల కడదామా,
పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా || లలితా ||

చరణం: 4
నవ రాత్రులలో దశ రాత్రులలో కొలిచే తల్లి, మన తల్లి
మగువల పాలిట కల్పవల్లి, అందరికీ తల్లీ       || లలితా ||

చరణం: 5
లలితను పూజించే, చేతులే చేతులట,
ఆ తల్లిని దర్శించే, కనులే కన్నులట
పారాయణకే పరవశ మొంది భక్తుల బ్రోచునటా  || లలితా ||

చరణం: 6 
మంగళ మనరమ్మా , జయ మంగళ మనరమ్మా
మంగళ గౌరికి అంగనలంతా మంగళ మనరమ్మా
అన్న వారికి అన్నంత ఫలము, విన్న వారికి విన్నంత ఫలము  || లలితా ||

In English
Lalitha sahasra parayaNa manamanthaa cheddaamaa
manasaara ammanu kolichi harathu liddaamaa

Charanam: 1
aahwaa niddaamaa, arghya paadyaaa liddaamaa
simhaasanamuna kurchobetti singariddamaa   || Lalitha||

Charanam: 2
poojalu cheddaamaa, poola maalalu veddamaa
paalu, pandlu, tene, chekkaratho  abhishekiddamaa || Lalitha ||

Charanam: 3
archana cheddaamaa, manasu arpaNa cheddaamaa
talliki madilone, kovela kadadaamaa
padi kaalaalu pasupu kumkumalu immani koremaa || Lalitha ||

Charanam: 4
nava ratrulalo dasha ratrulalo koliche talli, mana talli
maguvala paalita kalpavalli, andariki talli   || Lalitha ||

Charanam: 5
Lalithanu poojinche chethule chetulata,
aa tallini darshinche kanule kannulata,
paaraayaNake paravasha mondi bhakthula brochunata || Lalitha ||

Charanam: 6
mangaLa manaramma, jaya mangaLa manaramma
mangaLa gowriki anganalantha, mangaLa manaramma
anna vaariki annantha phalamu, vinna vaariki vinnantha phalamu || Lalitha ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails