మన ముఖ్యమైన పండుగలలో ఒకటి దసరా. ఈ పండుగ నవరాత్రులు అమ్మవారిని పూజించిన తరువాత పదవరోజున పండుగగా జరుపుకుంటాము. ఐతే తెలుగు తిథుల ప్రకారం ప్రతి ఏడాది ఈ పండుగ రోజులు మారుతూ ఉంటాయి.
అప్పుడప్పుడు రెండు తిథులు ఒకే రోజు రావటం కూడా జరుగును. అలంటి అప్పుడు ఇద్దరు అమ్మవరులది నామాలు వల్లించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
ప్రతి రోజు అమ్మవారి ఒక్కొక్క రూపాన్ని పూజించుకుంటాము. క్రింద పేర్కొన్న విధముగా ఒక్కో రోజు ఒక్కో అమ్మవారిని పూజించి, అమ్మవారి నామాలు చదివి, ఆ యా దేవి కరుణను కురిపించమని వేడుకుంటాము. (క్రింద పేర్కొనిన అమ్మవారి రోజులు, వేరే దగ్గర నుండి సేకరించినది. )
మొదటి రోజు - శ్రీ దుర్గ అమ్మవారు
రెండవ రోజు - శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి
మూడవ రోజు - శ్రీ అన్నపూర్ణా మాత
నాలుగవ రోజు - శ్రీ గాయత్రీ దేవి
ఐదవ రోజు - శ్రీ లలిత దేవి
ఆరవ రోజు - శ్రీ మహాలక్ష్మి దేవి
ఏడవ రోజు - శ్రీ సరస్వతి దేవి
ఎనిమిదవ రోజు - శ్రీ మహిషాసుర మర్ధిని దేవి
తొమ్మిదవ రోజు - శ్రీ రాజ రాజేశ్వరి దేవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి